కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం సమ్మతమే. ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ్ నిర్మించారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కి ఇటీవల ప్రేక్షకులముందుకొచ్చింది సినిమా. తాజాగా హైరాబాద్‌లో సక్సెట్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ప్రేక్షకుల వల్లే సమ్మతమే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇది ప్రేక్షకుల విజయం. నా ఎస్ ఆర్ కల్యాణ మండపం కి కూడా మొదట్లో మిశ్రమ రివ్యూలు వచ్చాయి. ఆ తర్వాత సినిమా బ్లాక్ బస్టర్. సమ్మతమే మార్నింగ్ షో తర్వాత మిశ్రమ రివ్వూలు వినిపించాయి. అదే రోజు సాయత్రం ఓ థియేటర్‌కి వెళ్లి చూస్తే హౌస్‌ఫుల్ అయింది అన్నారు. గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ డబ్బులుంటే ఎవరైనా సినిమా తీస్తారు. కానీ హిట్ కొట్టడం ముఖ్యం. మా సొంత డబ్బులతో సమ్మతమే తీసి, సూపర్ హిట్ కొట్టడం హ్యాపీగా ఉంది అన్నారు. ప్రవీణ్ మాట్లాడుతూ సమ్మతమే ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.














