దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై అభిశంసన తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ 204-85 ఓట్లతో ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కోర్టు 180 రోజుల్లోగా పరిశీలిస్తుంది. ఈలోగా ఆయనను పదవిలో కొనసాగించా లా? వద్దా? అనే అంశంపై న్యాయస్థానం ఆదేశాలు ఇస్తుంది. ఆయనను పదవి నుంచి తొలగించాలని ఆదేశిస్తే , 60 రోజుల్లోగా ఎన్నికలు జరగాలి. ఈ నేపథ్యంలో ఆయన అధికారాలను తగ్గించే అవకాశాలు కూడా ఉన్నట్లు మీడియా చెబుతున్నది. యూన్ సుక్ యోల్ ఇటీవల మార్షల్ లా విధించడంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.