అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకు నాట్స్ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ను నాట్స్ టీం ప్రారంభించింది. దీని ద్వారా సంబరాలకు హాజరయ్యే వారు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ సంబరాలకు విచ్చేసే తెలుగు అతిరథ మహారథుల గురించి ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. పద్మ భూషణ్, గానకోకిల పి. సుశీల, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ సంగీత దర్శకులు థమన్, మణిశర్మ, ఇలిజియం బ్యాండ్తో పాటు ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల, సహజనటి జయసుధ, సాయి కుమార్, జగపతిబాబు, ఆలీ ఇలా ఎందరో సినీ స్టార్లు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాల్గొననున్నారు. సంబరాలకు వచ్చే అతిథులపై ఇప్పటికే దాదాపు స్పష్టత వచ్చిందని సంబరాల కమిటీ సమావేశంలో కమిటీ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని తెలిపారు.
