Skip to main content

Namaste NRI

ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై రాని సరికొత్త కథ మిరాకిల్

రణధీర్‌ బీసు, హెబ్బా పటేల్‌, సురేష్‌, శ్రీరామ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మిరాకిల్‌. ప్రభాస్‌ నిమ్మల దర్శకుడు. హైదరాబాద్‌ పరిసర గ్రామమైన కొండమడుగులో మూడో షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానటువంటి ప్రేమ కథ ఇదని దర్శకుడు తెలిపారు. తన కెరీర్‌లోనే ఇదొక వైవిధ్యమైన చిత్రమని హెబ్బా పటేల్‌ చెప్పింది. సినిమా దాదాపు 90 శాతం షూటింగ్‌ను పూర్తిచేసుకుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌ రెడ్డి, నిర్మాతలు: రమేష్‌ ఎగ్గిడి, శ్రీకాంత్‌ మొగదాసు, చందర్‌గౌడ్‌, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: ప్రభాస్‌ నిమ్మల.

Social Share Spread Message

Latest News