Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇరాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదని జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజాని హెచ్చరించారు. ఖమేనీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఆయన, తమ నాయకుడి మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

తాము ట్రంప్‌ను వదిలిపెట్టమని, ఖమేనీ మృతికి ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని లారిజాని పేర్కొన్నారు. దాడుల్లో తమ నాయకుడితో సహా అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇది సాధారణ విషయం కాదని, దీనికి తగిన రీతిలో తాము ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ఈ యుద్ధంలో తాము అనేక మంది అమెరికన్‌ సైనికులను బంధించామని అలీ లారిజాని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News