చైనాలో ఓ కంపెనీ విడుదల చేసిన ఉద్యోగ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఫలానా రాశిలో (ఇయర్ ఆఫ్ ద డాగ్) పుట్టిన దరఖాస్తుదారులను తీసుకోబోమని ఆ దేశంలోని ఓ రవాణా కంపెనీ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. తక్కువ అర్హతలున్నా, వేరే రాశిలో జన్మించిన వారి దరఖాస్తులను తీసుకుంటామని తెలిపింది.

గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని సాంక్సింగ్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ క్లర్క్ ఉద్యోగాల కోసం పత్రికల్లో ప్రకటన విడుదల చేసింది. ఇయర్ ఆఫ్ ద డాగ్ లో పుట్టిన దరఖాస్తుదారులను బ్యాన్ చేసినట్టు తెలిపింది. దీనిపై కంపెనీ ఉద్యోగి మాట్లాడుతూ కంపెనీ బాస్ రాశి డ్రాగన్. దీనికి ఇయర్ ఆఫ్ ద డాగ్ కు పొంతన కుదరదు. కంపెనీకి నష్టం వాటిల్లుతుందని భావించాం అని చెప్పారు.
