మంగళగిరి ఏసీఏ స్టేడియం వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్ 5 అత్యంత వైభవంగా ప్రారంభమైంది. గ్లోబల్ స్టార్ Ram Charan ముఖ్య అతిథిగా విచ్చేసి, ఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించి క్రీడాకారుల్లో నూతనోత్సహాన్ని నింపారు


ఈ సందర్భంగా క్యాపిటల్ అమరావతి వర్సెస్ భీమవరం బుల్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌కు రామ్ చరణ్ టాస్ వేసి మ్యాచ్‌ను అధికారికంగా ప్రారంభించారు. యువ ప్రతిభను వెలికి తీసేందుకు ఈ లీగ్ అద్భుత ఆవకాశమని పేర్కొన్నారు.


రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్… గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్… ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మైదానంలో పరుగుల సునామీ.. నెక్స్ట్ లెవెల్ క్రికెట్ ఫీవర్ మధ్య.. భారీ సంఖ్యలో అభిమానులు, క్రీడాభిమానులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


ఈ మెగా క్రికెట్ పండగలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ, కేశినేని శివనాథ్ (చిన్ని) తదితరులు పాల్గొన్నారు.





























