మోహన్‌లాల్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఫాంటసీ అడ్వెంచర్ బరోజ్ 3డి. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా మోహన్‌లాల్ విలేకరులతో ముచ్చటించారు. బరోజ్ ఓ త్రీడీ ఫాంటసీ ఫిల్మ్. ఇప్పటివరకూ మలయా ళం నుంచి మూడు త్రీడీ సినిమాలే వచ్చాయి. లేటెస్ట్ టెక్నాలజీని వాడుకొని యునిక్‌గా సినిమా చేశాం. అద్భుతంగా వచ్చింది. విజువల్ వండర్‌లా ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ కూడా ఆసక్తిగా ఉంటుంది. గార్డియన్ ఆఫ్ ది గామాస్ ట్రెజర్ అనే నవల ఆధారంగా ఈ ఇమాజనరీ అడ్వెంచర్ కథను రూపొందించాం. నిధి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఓపెన్ మైండ్‌తో వచ్చి ఈ ఊహాజనిత ప్రపంచాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా.ప్రఖ్యాత హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు.
హాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ మార్క్ కిల్లియన్ బీజీఎం ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. 12ఏళ్ల లిడియన్ నాదస్వరం ఈ సినిమాకు సాంగ్స్ కంపోజ్ చేశాడు. సంతోష్‌శివన్ కెమెరా విజువల్స్ సినిమాకు హైలైట్. గ్రాఫిక్ వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది. యానిమేటెడ్ క్యారెక్టర్లను కూడా క్రియేట్ చేశాం. దర్శకుడిగా తొలి సినిమానే త్రీడీలో చేయడం ఓ సవాల్. ఇది నాకు కొత్త అనుభూతినిచ్చింది. గత 40ఏళ్లుగా ఇలాంటి సినిమా రాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.