వ్యవసాయ చట్టాలను చేసి ఎంతో మంది రైతుల ఉసురు తీసుకున్న బీజేపీకి ప్రజలు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని టీఆర్‌ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజ్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రైతులను అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులను కేంద్రం ముందునుంచే చిన్న చూపు చూస్తుందని విమర్శించారు. యాసంగి ధాన్యం మొత్తం కొనాలంటూ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినా తెలంగాణ మంత్రులతో అహంకారపూరితంగా మాట్లాడిన పీయూష్ గోయల్ రైతాంగానికి క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలకు తెలంగాణ గురించి ఆలోచించే సమయం లేదు. రోజుకో కొత్త వేషం వేసి అసలు సమస్యలను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి జీవితాన్ని దుర్భరం చేశారన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)