2023 సాధారణ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలతో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం అని టీఆర్‌ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ మునుగోడు మొనగాడు సీఎం కేసీఆరేనని అన్నారు. సీఎం కేసీఆర్‌ను రాష్ట్రానికి పరిమితం చేయాలని కేంద్రంలోని బీజేపీ కుట్ర పన్నిందని, అందులో భాగంగానే బీఆర్‌ఎస్ పార్టీని ప్రకటించిన వెంటనే మునుగోడు ఉప ఎన్నికలు ముందుకు తెచ్చారని విమర్శించారు. అయితే బీజేపీ కుటిల యత్నాలకు కేసీఆర్ తనదైన రాజకీయ చాణక్య నీతితో చెక్‌పెట్టారని వెల్లడిరచారు. వేల కోట్ల కాంట్రాక్టులు, ఎమ్మెల్యేలకు వందల కోట్లు ఆశ చూపి నీచ రాజకీయాలు, స్వతంత్ర అభ్యర్థుల ఎన్నికల గుర్తులను ఏమార్చి మునుగోడు ప్రజలను బీజేపీ మోసం చేయాలనుకుందన్నారు. టీఆర్‌ఎస్ విజయం ద్వారా మోదీ, అమిత్ షాలకు ముఖ్యమంత్రి కర్రుకాల్చి వాతపెట్టారని అన్నారు.