అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది. 2020లో అమెరికా క్యాపిటల్ భవనం వద్ద జరిగిన అల్లర్లకు ఆయనను బాధ్యుడిని చేస్తూ రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్ నుంచి ఆయన పేరును తొలగిస్తూ కొలరాడో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మొదట కాంగ్రెస్ చర్య తీసుకోకుండా, అంతర్యుద్ధం తర్వాతి కాలంనాటి రాజ్యాంగ నిబంధనను రాష్ర్టాలు ప్రయోగించి, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్‌ను ఎన్నికలకు దూరంగా ఉంచలేవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో కొలరాడో, ఇలినాయిస్, మైనే వంటి చోట్ల ట్రంప్‌నకు వ్యతిరేకంగా పిటిషనర్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రిపబ్లికన్ పార్టీ తరపున దేశాధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్ ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.
