కువైత్ ప్రభుత్వం విజిట్ వీసా, రెసిడెన్సీ పరిట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. విజిట్ వీసా, రెసిడెన్సీ పర్మిట్‌ల జారీకి సంబంధించిన నిబంధనల్లో కువైత్ ప్రభుత్వం మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే విజిట్ వీసా , రెసిడెన్సీ పర్మిట్ల ఫీజులు రెండు నుంచి మూడింతలు పెరగొచ్చు. ఈ నెలాఖరున జరిగే సమావేశంలో ఇంటీరియర్ మినిస్టర్ షేక్ తలాల్ అల్ ఖలేద్ అల్ సాహెబ్ దీనిపై నిర్ణయం తీసుకొనున్నారు. అలాగే రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లఘించిన వాళ్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అతి త్వరలోనే వీటిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
