Skip to main content

Namaste NRI

వెనిజువెలా ఆక్రమణకు అమెరికా సన్నాహాలు!

వెనిజువెలా చుట్టూ గగనతలాన్ని మూసివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ దేశ భూభాగాన్ని అమెరికా దురాక్రమించుకునే అవకాశం ఏక్షణంలోనైనా ఉందని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. వెనిజువెలా అధ్యక్షుడు నికొలస్‌ మదురోతో తాను మాట్లాడినట్లు ట్రంప్‌ వెల్లడించినప్పటికీ అమెరికాకు చెందిన అతి పెద్ద యుద్ధ నౌక గెరాల్డ్‌ ఆర్‌.ఫోర్డ్‌తోసహా 10 అమెరికా యుద్ధనౌకలు కరీబియన్‌ సముద్రానికి అత్యంత సమీపంలో తిష్టవేసినట్లు తెలిసింది. భూఆక్రమణ చేసే సామర్థ్యం ఉన్న సముద్రపు సాహసయాత్ర యూనిట్‌ కూడా కరీబియన్‌ చేరువలోనే ఉన్నట్లు తెలిసింది. యూఎస్‌ఎస్‌ గెరాల్డ్డ్‌పైన దాదాపు 70 యుద్ధ విమానాలను నిలిపే సామర్థ్యం ఉంది. ఉత్తర కరోలినాలోని వైమానిక కేంద్రం నుంచి పనిచేసే 2,200 మంది నావికులను కూడా కరీబియన్‌కి అమెరికా తరలించింది.

Social Share Spread Message

Latest News