Skip to main content

Namaste NRI

బెల్లా బెల్లా సాంగ్ ప్రమోషన్స్ తో అదరగొడుతున్న రవి తేజ

రవితేజ హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్‌ సమర్పిస్తోంది. రవితేజ సరసన ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయతి కథా నాయికలుగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు. బెల్లా బెల్లా అంటూ సాగే తొలి గీతాన్ని సోమవారం విడుదల చేశారు.

భీమ్స్‌ సిసిరోలియో స్వరపరచిన ఈ పాటను సురేష్‌ గంగుల రచించారు. స్పెయిన్‌కే అందాలనిట్ట అద్దిన ఓ పూల బుట్టా, వీధుల్లో పోతుంటే అట్టా వార్తల్లో రాయాలి చిట్టా అంటూ హుషారైన బీట్‌తో సాగిందీ గీతం. ఈ పాటలో శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. రవితేజ-అషికా రంగనాథ్‌ మధ్య కెమిస్ట్రీ కట్టిపడేసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైన్‌: ఏఎస్‌ ప్రకాష్‌, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, రచన-దర్శకత్వం: కిషోర్‌ తిరుమల.

Social Share Spread Message

Latest News