Namaste NRI

అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ నేటితో 38వ రోజుకు చేరుకుంది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్‌డౌన్‌ గా ఇది చరిత్ర సృష్టించింది. ఈ షట్‌డౌన్‌తో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ షట్‌డౌన్‌ దేశంలోని పలు విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. షట్‌డౌన్‌ సమయంలో ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్న ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు, టీఎస్‌ఏ సిబ్బంది అనారోగ్య కారణాలతో విధులకు గైర్హాజర్‌ కావడంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో విమానాల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

విమాన సేవల్లో కోత విధించేందుకు సిద్ధమైంది. రద్దీ అత్యధికంగా ఉన్న 40 విమానాశ్రయాల్లో 10 శాతం విమానాలను రద్దు చేయనుంది. ఈ మేరకు ఆ దేశ రవాణా శాఖ మంత్రి సీన్‌ డఫీ ప్రకటించారు. ఈ మార్పులు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. పరిమిత సంఖ్యలో ఉన్న ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌పై ఒత్తిడి తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితి మరింత దిగజారితే అదనపు ఆంక్షలు ఉంటాయని మంత్రి వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events