Namaste NRI

అమెరికా కంపెనీ కీలక నిర్ణయం.. మీటింగ్‌కు హాజరు కాలేదన్న కారణంతో

అమెరికాకు చెందిన ఓ మ్యూజిక్‌ కంపెనీ సీఈవో  కీలక నిర్ణయం తీసుకున్నారు. మీటింగ్‌కు హాజరు కాలేదన్న కారణంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. మొత్తం 110 మంది ఉద్యోగుల్లో 99 మందిపై వేటు వేశారు. ఇటీవలే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సీఈవో మార్నింగ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి అందరూ హాజరు కావాలని ఆదేశించారు. అయితే, మొత్తం 110 మందిలో ఈ మీటింగ్‌కు కేవలం 11 మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా 99 మంది సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు సీఈవో ఉద్యోగులపై వేటు వేశారు. సమావేశానికి హాజరుకాని 99 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనులు పూర్తిచేయడంలో, సమావేశాలకు హాజరుకావడంలో విఫలమైనట్లు పేర్కొన్నారు. ఈ కారణం చేత ఉద్యోగులతో ఉన్న ఒప్పందాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కంపెనీకి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. సమావేశానికి హాజరైన ఉద్యోగులు మాత్రమే సంస్థలో ఉంటారని స్పష్టం చేశారు. ప్రస్తుతం సీఈవో వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress