ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో కీలక పరిణాం చోటు చేసుకుంది. వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న పుతిన్ దేశం మరోమారు ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడిరది. బాంబుల వర్షం కురిపిస్తూ హడలెత్తించింది. ఉక్రెయిన్‌లో శీతాకాలం ప్రారంభమై ఉష్ణోగ్రతలు పడిపోయిన తరుణంలో విద్యుత్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా భీకరదాడులు చేసింది. అయితే రష్యా క్షిపణి దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. క్రెమ్లిన్‌కు చెందిన క్రూజ్ మిసైల్స్‌ను నిర్వీర్యం చేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ గగనతంలోకి రెండు రష్యా క్షిపణులు దూసుకువచ్చాయి. వీటిని పసిగట్టిన ఉక్రెయిన్ సేనలు తమ మిసైల్స్‌ను ఉపయోగించి రష్యా క్షిపణులను పేల్చివేశాయి.