అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. డాక్టర్ రవి చౌదరిని ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. డాక్టర్ రవి చౌదరిని అసిస్టెంట్ సెక్రటరీగా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేసిన సమాచారాన్ని సెనేట్‌కు చేరవేశారు. ఈ నియామకానికి సెనేట్ ఆమోదముద్ర వేస్తే యూఎస్ ఎయిర్‌ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా డాక్టర్ రవి చౌదరి బాధ్యతలు స్వీకరిస్తారు. ఒబామా ప్రభుత్వ హయాంలో కూడా డాక్టర్ రవి కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆసియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐస్‌లాండర్స్‌పై పని చేసిన ప్రెసిడెంట్స్ అడ్వైజరీ కమిషన్‌లో సభ్యుడిగా డాక్టర్ రవి చౌదరి విధులు నిర్వర్తించారు.
