నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా భారతీయ అమెరికన్ రాజకీయ కార్యకర్త షెఫాలీ రజ్దాన్ దుగ్గల్‌ను అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నామినేషన్‌కు అమెరికన్ సెనేట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో త్వరలోనే షెఫాలీ నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాశ్మీర్ పండిట్ అయిన షెఫాలీ రజ్దాన్ దుగ్గల్ హరిద్వార్‌లో జన్మించారు. షెఫాలీకి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్‌కు వలస వెళ్లి అక్కడే స్థిరపడిరది. న్యాయవాది అయిన షెఫాలీ ప్రస్తుతం డెమోక్రాట్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన షెపాలీ రాజకీయ కార్యకర్త. మహిళా హక్కుల న్యాయవాది, మానవ హక్కుల ప్రచారకర్త అని అధికార భవనం వైట్‌హౌస్ తెలిపింది.