అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పరిపాలన బృందంలో మరో భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్‌లో ఓ కీలక పదవికి భారత సంతతి వ్యక్తి పేరును అధ్యక్షుడు ప్రతిపాదించారు. యూఎస్ వాయుసేనలో ఎయిర్ ఫోర్స్ అధికారిగా పనిచేసిన రవి చౌదరి ఇండో`అమెరికన్‌ను పెంటగాన్‌లోని ఎయిర్‌ఫోర్స్ ఫర్ ఇన్‌స్టల్లేషన్స్ అండ్ ది ఎన్విరాన్‌మెంట్ విభాగానికి అసిస్టెంట్ సెక్రటరీ పదవికి నామినేట్ చేశారు. బైడెన్ ప్రతిపాదనను అమెరికన్ సెనేట్ ఆమోదిస్తే రవి చౌదరి ఆ బాధ్యతలు చేపడతారు.
వర్జీనియాలో నివసించే రవి చౌదరికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి చౌదరి 1993 నుంచి 2015 వరకు అమెరికా వైమానిక దళంలో క్రియాశీలంగా ఉన్నారు. అతను సి`17 పైలట్ కూడా. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధంలో అనేక ఆపరేషన్లు చేపట్టాడు. ఏవియేషన్ ఇంజనీర్ కూడా అయిన రవి యూఎస్ వైమానిక దళానికి అత్యాధునిక సాంకేతికతను అందించడంలో సహకరిస్తారని ఆశిస్తున్నారు. ఒరాక్ ఒబామా కాలంలో ప్రెసిడెంట్ అడ్వైజరీ కమిషన్‌లో సభ్యుడుగా రవి చౌదరి ఉన్నారు. గతంలో ఆయన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ)లో అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్‌స ఇన్నోవేషన్ విభాగానికి డైరెక్టర్‌గా పనిచేశారు.