భారత్-చైనా సంబంధాలపై రాజ్యసభలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భం గా వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వద్ద పరిస్థితులపై సైతం సమాచారం ఇచ్చారు. ఎల్‌ఏసీలో ఇంకా చైనా తో కొన్ని భూభాగాలపై విభేదాలు ఉన్నాయని, ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతామని జైశంకర్ పేర్కొన్నారు. జూన్ 2020 గాల్వాన్ లోయరలో జరిగిన ఘర్షణ ఘటన భారత్ – చైనా సంబంధాలపై ప్రభావం చూపిందన్నా రు. సరిహద్దులో సైనికులు మారణించడం 45 ఏళ్లలో మొదటిసారి కాదని, అయితే, ఘటన తర్వాత పెద్ద సంఖ్యలో బలగాల మోహరింపునకు దారి తీసిందన్నారు. ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, మన సైనిక బలగాలు కొవిడ్ , లాజిస్టిక్స్ సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలోనూ గాల్వాన్ ఘటనలో అవసరమైన మేరకు స్పందించాయన్నారు. తీవ్రమైన చలితోపాటు ఎన్నో సవాళ్ల మధ్య వేగంగా పరిస్థితిని ఎదుర్కొన్నారన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని దళాల ఉపసంహరణ దశలవారీగా ప్రక్రియ పూర్తయ్యిందని దేప్‌సాంగ్, డెమ్‌చోక్‌లలో పూర్తి కాలేదన్నారు.