నవీన్ పొలిశెట్టి, మీనాక్షిచౌదరి జంటగా నటిస్తున్న చిత్రం అనగనగా ఒక రాజు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి. తాజాగా రాజు గారి పెళ్లి రిసెప్షన్ వేడుక పేరుతో మరో వైవిధ్యమైన వేడుకను చిత్ర బృందం నిర్వహించింది. హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఇంతటి వినోదాత్మక చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేద్దామనే చర్చ వస్తే, సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందని మా నిర్మాతలు భావించారు.

నేను ప్రేక్షకుల నుంచి వచ్చిన వాడినే. ఒకప్పుడు నేను ఏ హీరోల సినిమాలైతే థియేటర్‌కి వెళ్ళి చూసేవాడినో, ఇప్పుడు ఆ అభిమాన హీరోల సినిమాలతో పాటు, నా సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా సినిమాతోపాటు చిరంజీవి, ప్రభాస్ నటించిన సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అవి కూడా మంచి విజయాన్ని సాధించాలి అని తెలిపారు. ఇది నా మూడో సంక్రాంతి సినిమా. ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ సినిమాపై మీరు చూపించే ప్రేమ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అని కథానాయిక మీనాక్షి చౌదరి చెప్పారు. ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలోకి రానుంది.















