రణధీర్, నందిని జంటగా వినయ్ బాబు తెరకెక్కించిన చిత్రం సీతారామపురంలో ఒక ప్రేమ జంట. బీసు చందర్ గౌడ్ నిర్మాత. సుమన్, సూర్య అమిత్ తివారీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్ర ట్రైలర్ను నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. టైటిల్ చాలా బాగుంది. నాయకానాయికల జంట చూడముచ్చటగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే దర్శకుడి ప్రతిభ ఏంటో అర్థమైంది. ఈ చిత్రం విజయం సాధించి సినీ బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు వినయ్ మాట్లాడుతూ మా చిత్ర ట్రైలర్ దిల్ రాజు గారి చేతుల మీదుగా లాంచ్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. ట్రైలర్ నచ్చి మా చిత్రం యూనిట్ ప్రశంసించారు. నిజాయతీగా ప్రేమించుకున్న ప్రతి యువతీ యువకుడు చూడాల్సిన చిత్రమిదన్నారు. నిర్మాత బీను చందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రం. ఈ చిత్రంలో రణధీర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. నందిని హీరోయిన్గా నటించింది. త్వరలో సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.నివాస్, ఛాయాగ్రహణం: విజయ్ కుమార్.