Namaste NRI

ఉస్తాద్ నుంచి చుక్కల్లోంచి లిరికల్  సాంగ్

యంగ్ హీరో శ్రీసింహా కోడూరి క‌థానాయకుడిగా న‌టించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్. బలగం ఫేమ్ కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్.  వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై ఈ  చిత్రాన్ని ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌, అను హాస‌న్‌, రవీంద్ర విజ‌య్‌, వెంక‌టేష్ మ‌హ‌, ర‌వి శివ తేజ‌, సాయికిర‌ణ్ ఏడిద కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.తాజాగా ఈ సినిమా నుంచి చుక్క‌ల్లోంచి అనే లిరిక‌ల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. హీరోయిన్ బ‌స్సులో స్నేహితుల‌తో క‌లిసి ప్ర‌యాణిస్తుంటుంది. ఆ బ్స‌సు అనుకోకుండా ఆగిపోతుంది. దాంతో హీరోయిన్  హీరో ఉన్న టెంపో వ్యాన్‌లో ఎక్కుతుంది. అప్పుడు హీరోయిన్‌పై ఉన్న ప్రేమ‌ను ఊహించుకుంటూ పాడే పాటే చుక్కల్లోంచి  సాంగ్ చాలా కూల్‌గా, విన‌సొంపుగా ఉంది. అకీవా.బి సంగీత సార‌థ్యంలో రెహ‌మాన్ రాసిన పాట‌ను కార్తీక్ చ‌క్క‌గా అల‌పించారు.

శ్రీసింహ మూడు డిఫ‌రెంట్ షేడ్స్‌లో కనిపించ‌బోతున్నారు. డిఫ‌రెంట్ మూవీస్‌, ప‌రిమిత బ‌డ్జెట్‌ల‌తో రూపొందుతోన్న సినిమాల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తున్న నేప‌థ్యంలో ఉస్తాద్ నిర్మాత‌లు అదే న‌మ్మ‌కం తో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు. అకీవా. బి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగస్ట్ 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events