Skip to main content

Namaste NRI

అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం.. వైభవంగా బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ

అయోధ్యలో వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. 12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఐదు శతాబ్దాల స్వప్నం సాకారమైంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ ముగిసిన తర్వాత ప్రధాని మోదీ స్వామి వారి విగ్రహం వద్ద తొలి పూజ చేశారు. ఆయన పాదాల వద్ద పూలను ఉంచి నమస్కరించి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే రామజన్మభూమిపై హెలికాప్టర్లతో పూలను చల్లారు.

Social Share Spread Message

Latest News