మానవళి చరిత్రలో ఇప్పటివరకు చూడని భారీ మూలకాన్ని సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నట్టు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. టైటానియం పార్టికల్ బీమ్ ఉపయోగించి నివర్ మోరియం, ఎలిమెంట్ 116 నుంచి రెండు పరమాణువులను సృష్టించినట్టు లారెన్స్ బెర్కెలే నేషనల్ ల్యాబొరేటరీ(బెర్కెలే ల్యాబ్) శాస్త్రవేత్తలు న్యూక్లియర్ స్ట్రక్చర్ 2024 సదస్సులో ప్రకటించారు. 120వ మూలకాన్ని సృష్టించడంలో ఇది కీలకమైన అడుగు అని చెప్పారు. ఈ మూలకాన్ని సృష్టించడం అంత సులువు కాకపోయినా, సాధ్యమేనని బెర్కెలే ల్యాబ్ న్యూక్లియర్ సైన్స్ విభాగం డైరెక్టర్ రీయర్ క్రూకెన్ తెలిపారు. కాగా, ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కనుగొన్న 118 మూలకాల్లో ఈ ల్యాబ్‌లోనే 16 మూలకాలను కనుగొన్నారు.