వాట్సాప్‌లో కొత్త ఫీచర్లను తీసుకువచ్చేందుకు మెటా కసరత్తు చేస్తున్నది. బ్రాడ్‌కాస్ట్ చానల్‌ను సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురానున్నది. బ్రాడ్‌కాస్ట్ చానల్ ద్వారా గ్రూప్ తరహాలోనే సంభాషణలకు అవకాశం ఇవ్వనున్నది. బ్రాడ్‌కాస్ట్ చానల్‌లో వెరిఫికేషన్ స్టేటస్, ఫాలోయర్ల సంఖ్య చూడటం, నోటిఫికేషన్ బటన్ మ్యూట్ చేసుకోవడం, చానల్ డిస్క్రిప్షన్, షార్ట్‌కట్స్, ప్రైవసీ, రిపోర్టింగ్, విజిబులిటీ స్టేటస్ వంటి మొత్తం 12 ఫీచర్లను కూడా చేర్చనుంది. అడ్మిన్ రివ్యూ అనే మరో ఫీచర్‌ను వాట్సాప్ గ్రూప్‌లలో కూడా చేర్చనుంది. దీని ద్వారా వాట్సాప్ గ్రూప్‌ల అడ్మిన్‌లకు పలు కొత్త ఆప్షన్లు రానున్నాయి. గ్రూప్ సభ్యులు ఎవరైనా గ్రూప్‌లోని మెసేజ్ సరైనది కాదని గుర్తిస్తే అడ్మిన్‌కు రిపోర్ట్ చేయవచ్చు. అడ్మిన్ ఆ మెసేజ్‌ను పరిశీలించి డిలీట్ చేసే అవకాశం ఉంటుంది.


