ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సెల్ఫిష్. ఇవానా కథానాయిక. కాశీ విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. మాస్ లవ్‌స్టోరీగా మెప్పిస్తుంది. వినూత్నమైన కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన దిల్‌ఖుష్ అనే ఫస్ట్‌సింగిల్‌కు మంచి స్పందన లభిస్తున్నది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్ జె, సంగీతం: మిక్కీ జే మేయర్, రచన-దర్శకత్వం: కాశీ విశాల్.


