కరోనా సంక్షోభం కారణంగా స్వదేశానికి శాశ్వతంగా తిరిగొచ్చిన ఎన్నారైల పునరావాసం కోసం కేరళ ప్రభుత్వం కేంద్రానికి ఓ కొత్త ప్రతిపాదన పంపించేందుకు సిద్ధమవుతోంది. విదేశాల నుంచి కేరళకు తిరిగొచ్చిన వారి కోసం కేంద్రం రూ.2. వేల కోట్లు కేటాయించాలనే ప్రతిపాదన పంపనుంది. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 2020 మే నుంచి ఇప్పటి వరకూ దాదాపు 39 లక్షల మంది ఎన్నారైలు కేరళకు చేరుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో పేర్కొన్నారు. ప్రస్తుతం తాము ప్రతిపాదిస్తున్న ప్యాకేజీ ఇప్పటికే అమలులో ఉన్న సంక్షేమ పథకాలకు అదనమని స్పష్టం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)