1912లో ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌకకు సంబంధించిన కథలు ఇప్పటి కీ ప్రజలను కట్టిపడేస్తున్నాయి. ఈ నౌకలో ప్రయాణించి, ప్రాణాలు కోల్పోయినవారి జ్ఞాపకాలు చెక్కు చెదరకుం డా నిలిచి ఉన్నాయి. ప్రమాదంలో మరణించిన అత్యంత సంపన్న వ్యాపారవేత్త జాన్ జాకబ్ ఆస్టర్ (47)కు గల గోల్డ్ పాకెట్ వాచ్ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికాలోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ వేలం సంస్థ నిర్వహించిన వేలంలో ఈ వాచీని రూ.12.17 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. ఈ నౌక మునిగిపో తున్నపుడు ఓ ప్యాసింజర్ వాయించిన వయొలిన్‌ను ఇదే సంస్థ 2013లో వేలం వేసింది. అప్పట్లో దానికి పలికిన ధర (1.1 మిలియన్ పౌండ్లు) రికార్డు సృష్టించింది.