Namaste NRI

ఎవరెస్ట్‌ పర్వతారోహకులకు కొత్త నిబంధన … ఇకపై

ఎవరెస్ట్‌ పర్వతారోహకులకు కొత్త నిబంధన విధించారు. ఇకపై పర్వతంపై విసర్జించిన మలాన్ని ప్రత్యేక సంచుల్లో బేస్‌ క్యాంప్‌కు తీసుకురావాలి. ఆ సంచులను విధిగా తనిఖీ చేస్తారు. పర్వతారోహకుల మల విసర్జ నలతో ఎవరెస్ట్‌ శిఖరం కంపు కొడుతున్నది. విపరీతంగా పేరుకుపోతున్న మల, ఇతర వ్యర్థాల వల్ల అనర్ధాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్‌ పర్వత్వానికి చెందిన నేపాల్‌లోని పసాంగ్ లాము గ్రామీణ మున్సిపా లిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ఆ మున్సిపాలిటీ చైర్మన్ మింగ్మా షెర్పా ఈ కొత్త నిర్ణయం గురించి మాట్లాడారు. విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా పర్వతాలపై మల విసర్జన పూర్తిగా క్షీణించదని తెలిపారు. దీంతో పర్వతాల్లో దుర్వాసన వస్తున్నదని చెప్పారు. దీనివల్ల కొంత మంది పర్వతారోహకులు అనారోగ్యానికి గురవుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని అన్నారు. ఈ పరిస్థితి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్న ఆయన, తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్‌ పర్వతాన్ని, పొరుగున ఉన్న మౌంట్ లోట్సేను అధిరోహించా లనుకునే వ్యక్తులు రసాయనాలతో కూడిన ప్రత్యేక మల సంచులను బేస్ క్యాంప్‌లో కొనుగోలు చేయాలని మింగ్మా షెర్పా తెలిపారు. వారు బేస్‌ క్యాంప్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆ మల సంచులను తనిఖీ చేస్తారని చెప్పారు. ఈ చర్య ద్వారా ఎవరెస్ట్‌ పర్వతాలపై మల విసర్జాలను నివారించి అక్కడి పర్యావరణాన్ని కాపాడుతామని ఆయన అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress