Namaste NRI

దీక్ష లో దేశభక్తి గీతం రిలీజ్

ప్రతాని రామకృష్ణ గౌడ్‌ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ఆర్‌కే దీక్ష. అక్సఖాన్‌, అలేఖ్యరెడ్డి, కిరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌తో పాటు సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. చక్కటి సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీనాయక్‌ను గుర్తుచేసుకుంటూ ఓ పాట ఉంటుందని, ఫిబ్రవరిలో రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్నకుమార్‌, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజు కిరణ్‌, దర్శకనిర్మాత: ప్రతాని రామకృష్ణగౌడ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events