అమెరికాలోని న్యూయార్క్ తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన సంకేత్ జయేశ్ బల్సారా నియమితులయ్యారు. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వర్గాలు ప్రకటించాయి. బల్సారా ప్రస్తుతం అదే కోర్టు మేజిస్ట్రేటుగా పనిచేస్తున్నారు. 2017 నుంచి ఆయన ఆ పదవిలో కొనసాగుతు న్నారు. దీంతో ఈ పదవిని చేపట్టిన మొదటి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా రికార్డుల్లో నిలిచారు. తాజాగా అదేకోర్టులో న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 50 ఏండ్ల క్రితం భారత్, కెన్యాల నుంచి వలస వచ్చిన దంపతుల కుమారుడు. ఆయన తండ్రి న్యూయార్క్ మున్సిపాలిటీలో ఇంజినీరుగా పనిచేయగా, తల్లి నర్సుగా వర్క్ చేస్తున్నారు. బల్సారా సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, దివాలా, నియంత్రణ వ్యవహారాల్లో నిపుణుడు.
