గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. రాశీ ఖాన్నా నాయిక. సత్యరాజ్, రావు రమేష్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి అందాల రాశీ అనే పాటను విడుదల చేశారు. అందాల రాశీ మేకప్ వేసి నా కోసం వచ్చావే.. స్వర్గంలో కేసే నా మీద వేసి భూమ్మీద మూసావే అంటూ సాగుతుందీ పాట. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని రాయగా, సాయిచరణ్ భాస్కరుని, రమ్య బెహరా పాడారు. ఈ పాటకు మంచి స్పందన వస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ వాసు నిర్మాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా జూలై 1న విడుదలకు సిద్దమవుతున్నది. సంగీతం: జకేస్ బిజాయ్, ఛాయాగ్రహణం: కరమ్ చావ్ల, కూర్పు : ఎన్ పి ఉద్భవ్.














