భారతీయ సంతతికి చెందిన కౌశిక్ రాజశేఖర ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. అమెరికాలోని హ్యూస్టన్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన విద్యుత్తు ఉత్పాదక ఉద్గారాలను తగ్గించేటపుడు విద్యుత్తు రవాణా, శక్తిసామర్థ్య సాంకేతికతల రంగంలో అందించిన సేవలకుగాను ఆయనకు ఈ బహుమతి దక్కింది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 43 దేశాల నుంచి 119 నామినేషన్లు రాగా, ముగ్గురిని మాత్రమే గ్లోబల్ ఎనర్జీ అసోసియేషన్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అక్టోబరు 12`14 తేదీల మధ్య మాస్కోలో జరిగే రష్యన్ ఎనర్జీ వారోత్సవాల్లో అవార్డులను అందజేస్తారు. దక్షిణ భారతదేశంలోని ఓ కుగ్రామం నుంచి రాజశేఖర ఈ స్థాయికి ఎదిగారు.














