Namaste NRI

మరో భారతీయుడికి ప్రతిష్టాత్మక పదవి.. బైడెన్ నామినేట్

భారతీయుల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ప్రపంచంలోనే మేటి సంస్థలకు పలువురు భారతీయులు సారథ్యం వహిస్తున్నారు. తాజాగా, మరో భారతీయుడు ప్రతిష్టాత్మక పదవికి అడుగు దూరంలో ఉన్నారు. ఇండియన్- అమెరికన్ అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అమెరికా తరఫున ప్రతిపాదిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ కీలక సమయంలో ఈ బాధ్యత చేపట్టడానికి, ప్రపంచ బ్యాంకును నడిపించడానికి అజయ్ అన్ని విధాలుగా సమర్థుడని బైడెన్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు, పెట్టుబడులు కల్పించిన ప్రపంచస్థాయి సంస్థలను నిర్మించడంలో, నడిపించడంలో మూడు దశాబ్దాలుగా అజయ్ బంగా విజయవంతంగా పని చేస్తున్నారని జో బైడెన్ కొనియాడారు.  ఒకవేళ అజయ్ బంగాను అధ్యక్షుడిగా ప్రపంచ బ్యాంకు బోర్డు డైరెక్టెర్లు ఎన్నుకుంటే వరల్డ్ బ్యాంకు మొట్టమొదటి ఇండియన్ – అమెరికన్, సిక్కు – అమెరికన్‌గా  ఆయన చరిత్ర సృష్టించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress