ఈ నెల 14 నుంచి 16 వరకు చైనా అధినేత జిన్‌పింగ్ కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లో పర్యటించనున్నట్లు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఉజ్జెకిస్తాన్‌లో షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) 22వ సదస్సులో జిన్‌పింగ్ పాల్గొనున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాల్గొనే అవకాశముంది. 2020 జనవరిలో మయన్మార్‌లో పర్యటించిన జిన్‌పింగ్ కరోనా నేపథ్యంలో విదేశాలకు వెళ్లడం మానుకున్నారు. ఎస్సీఓలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్జెకిస్తాన్, భారత్, పాకిస్తాన్ సభ్యదేశాలు ఇరాన్‌ను సైతం చేర్చుకొనేందుకు రంగం సిద్ధమయ్యింది.