భారతీయ శాస్త్రవేత్తకు యూరోప్‌లో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక యురోపియన్ మాలిక్యులార్ బయోలాజీ ఆర్గనైజేషన్ (ఈఎంబీవో)కు డాక్టర్ మహిమా స్వామి ఎంపిక చేశారు. యూరోప్‌లో ఉన్న మేటి బయోలజీ నిపుణుల్లో ఒకరిగా ఆమెను గుర్తించారు. బెంగుళూరుకు చెందిన డాక్టర్ మహిమా స్వామి యునివర్సిటీ ఆఫ్ దుండేలో లైఫ్ సైన్సెస్‌లో నిపుణురాలిగా పనిచేస్తున్నారు. అక్కడ ఉన్న పరిశోధనా బృందానికి ఆమె హెడ్‌గా ఉన్నారు. పేగుల్లో ఇమ్యూనిటీ గురించి ఆ బృందం స్టడీ చేస్తోంది.
యూనివర్సిటీలోని మెడికల్ రీసర్చ్ కౌన్సినల్ ప్రోటీన్ పాస్పొరైలేషన్ అండ్ ఉబిక్విటలేషన్ యూనిట్‌లో మహిమా పరిశోధన చేపడుతున్నారు. ఆమె గ్రూపులో మరో 23 మంది పరిశోధకులు ఉన్నారు. ప్రస్తుతం యురోప్‌లోని ఈఎంబీవో ప్రోగ్రామ్‌లో 135 మంది నిపుణులు ఉన్నారు. మరో 390 మంది మాజీ సభ్యులు ఉన్నారు. యురోపియన్ బయోలజీ ఆర్గనైజేషన్ నెట్వర్క్‌లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని మహిమా తెలిపారు. పరిశోధనాలశాలకు, తనకు మార్గదర్శనం చేసినవాళ్లకు ఎంతో రుణపడి ఉన్నానని ఆమె అన్నారు.