Namaste NRI

రజనీకాంత్‌కు అరుదైన గౌరవం

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నుంచి గోల్డెన్‌ వీసా  అందుకున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ సూపర్‌ స్టార్‌ సంతోషం వ్యక్తం చేశారు. యూఏఈ గోల్డెన్‌ వీసా పొందడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా యూఏఈ ప్రభుత్వానికి రజనీకాంత్‌ కృతజ్ఞతలు తెలిపారు.

పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, సాహిత్యం, క‌ల్చర్‌, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేటర్లు,  ఇలా వివిధ రంగాలకు చెందిన వారికి 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఈ వీసా పొందిన వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా యూఏఈలో దీర్ఘకాలికంగా నివ‌సించే వీలు ఉంటుంది. 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేయ‌డం మొద‌లైంది. ఈ వీసాల‌కు 10 సంవ‌త్సరాల కాల‌ప‌రిమితి ఉంటుంది. ఆ త‌ర్వాత అవే రెన్యువ‌ల్ అవుతాయి. ఈ వీసాతో యూఏఈ పౌరులుగా ప్రభుత్వం క‌ల్పించే అన్ని ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే వంద శాతం ఓన‌ర్‌షిప్‌తో ఆ దేశంలో వ్యాపారాలు నిర్వహించుకోవ‌చ్చు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events