టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనాకు అరుదైన గౌరవం దక్కింది. చెన్నై లోని వేల్స్ విశ్వవిద్యాలయం సురేశ్ రైనాకు గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. పల్లావరంలోని వేల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ స్టడీస్ 12వ స్నాతకోత్సవం జరిగింది. ఇందులో సురేశ్ రైనాను గవర్నర్ ఆర్ఎన్ రవి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ విషయూన్ని ట్విటర్ వేదికగా అభమానులతో సురేశ్ రైనా పంచుకున్నారు. ప్రతిష్ఠాత్మక వేల్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ గౌరవాన్ని పొందినందుకు సంతోషంగా ఉంది. నాపై చూపిన ప్రేమ, అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. చెన్నై నాకు ఇల్లు వంటి. ఇది నాకు చాలా ప్రత్యేకం అని రైనా పేర్కొన్నారు. కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత రైనా ఐపీఎల్లో మాత్రం కొనసాగాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రైనా ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)