అగ్రరాజ్యం అమెరికాలో బిహార్‌లోని మారుమూల ప్రాంతమైన జిరాదేవి గ్రామానికి చెందిన యువకుడికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ యూనివర్సిటీలోని స్టూడెంట్ కౌన్సిల్‌కు తదుపరి ఎగ్జిక్యూటివ్ చైర్‌గా ఎన్నికయ్యాడు. భారత్‌కు చెందిన శరద్ వివేక్ సాగర్ హార్వర్డ్ గ్రాడ్యూయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన స్టూడెంట్ కౌన్సిల్‌కు తదుపరి ఎగ్జిక్యూటివ్ చైర్ ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం శరద్ సాగర్‌తో పాటు మొత్తం తొమ్మిది మంది పోటీ పడగా సెప్టెంబర్ 14 నుంచి 19 వరకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 50 దేశాలకు చెందిన సుమారు 1200 మది విద్యార్థులు శరద్ సాగర్‌ను స్టూడెంట్ కౌన్సిల్ తదుపరి ఎగ్జిక్యూటివ్ చైర్‌గా ఎన్నుకున్నారు.