అమెరికాలో అరుదైన సంఘటన జరిగింది. తల్లీ కూతుళ్లు చరిత్ర సృష్టించారు. పైలట్లు అయిన వారిద్దరూ కలిసి ఒకే విమానాన్ని నడిపారు. హోలీ పెటిల్‌కు విమాన రంగం అంటే ఎంతో ఇష్టం. తొలుత విమాన సహాయకురాలిగా పని చేశారు. అనంతరం విమాన పైలట్‌గా ఆమె రాణించారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో 18 ఏళ్లుగా పని చేస్తున్నారు. మరోవైపు హోలి కుమార్తె కీలి పెటిట్ కూడా చిన్నప్పటి నుంచి పైలట్ కావాలనుకుంది. 2017లో ఆమె పైలట్ లెసెన్స్ పొందింది. అనంతరం తల్లి పని చేస్తున్న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ట్రైనీగా చేరింది. 2018 నుంచి పూర్తి స్థాయి పైలట్‌గా ఆ సంస్థలో పని చేస్తున్నది. ప్రస్తుతం ఫస్ట్ ఆఫీసర్‌గా ఉన్నది. కాగా తల్లీకూతుళ్లైన హోలి, కీలి జులై 23న చరిత్ర సృష్టించారు. పైలట్లైన ఇద్దరు కలిసి డెన్వర్ నుండి సెయింట్ లూయిస్‌కు ప్రయాణికుల విమానాన్ని నడిపారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 3658 విమానానికి హోలి కెప్టెన్‌గా ఉండగా ఆమె కుమారె కీలి కో పైలట్‌గా ఉన్నది. ఇద్దరు కలిసి ఒకే విమానాన్ని నడిపి రికార్డు సృష్టించారు.