రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ తనయ, రిలయన్స్ జియో డైరెక్టర్ అయిన ఈశా అంబానీకి అరుదైన గౌరవం లభించింది. వాషింగ్టన్‌కు చెందిన స్మిత్ సోవియన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియణ్ ఆర్ట్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈశాతో పాటు కరోలిన్ బ్రెమ్, పీటర్ కిమ్మెల్మాన్‌లు సైతం నియమితులయ్యారు. గత నెల 23 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చిందని, నాలుగేళ్ల పాటు వీరు కొనసాగుతారని మ్యూజియం ఒక ప్రకటనలో పేర్కొంది. స్మిత్‌సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్‌ని 1923లో ప్రారంభించారు. రాబోయే 2023లో వందేళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వేడుకలను నిర్వహించే బాధ్యత కొత్తగా ఎన్నికైన బోర్డు సభ్యుల మీదే ఉంది.
స్మిత్ సోనియన్ మ్యూజియం పరిపాలనకు బాధ్యత వవహించే 17 సభ్యుల బోర్డ్ ఆఫ్ రీజెంట్స్ (బోర్డు ప్రతినిధులు)లో అమెరికా ప్రధాన న్యాయమూర్తి, అమెరికా ఉపాధ్యక్షుడు, సెనేట్‌లోని ముగ్గురు సభ్యులు, ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రెప్రెజెంటేటివ్స్) నుంచి ముగ్గురు తొమ్మిది మంది పౌరులుంటారు. 1923లో ఫ్రీర్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌గా ప్రారంభమై 2023లో వందేళ్ల వేడుకలను సిద్ధమవుతున్న ఈ మ్యూజియం బోర్డు సభ్యులో అత్యంత పిన్న వయస్కుల్లో ఈశా కూడా ఒకరు.