అమెరికా చరిత్రలో రికార్డులో స్థాయిలో గ్రీన్‌కార్డుల ఆమోదం రేటు కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో కేవలం 3 శాతం దరఖాస్తులు మాత్రమే ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సుమారు 3.7 కోట్ల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రాక్టికల్‌గా చూస్తే 97 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టు తెలుస్తున్నది. ఏటా గ్రీన్ కార్డుల కోసం డిమాండ్ పెరుగుతున్న ప్పటికీ కార్డుల జారీ సంఖ్య స్థిరంగా ఉంటున్నది. గ్రీన్ కార్డుల జారీలో లాటరీ విధానం పాటిస్తుండటం వల్ల అదృష్టం కొం దరి తలుపు మాత్రమే తడుతున్నది. గ్రీన్‌కార్డుల్లో క్యాప్‌డ్, అన్ క్యాప్‌డ్ క్యాటగిరీలు ఉండటం వల్ల దరఖాస్తుదారుల జీవిత భాగస్వాములు, మైనైర్లెన పిల్లలు, తోబుట్టువులు వాటిని పొందడం కష్టమవుతు న్న ది. ఈ పరిణామం అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న భారతీయ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నది. అందుబాటులో ఉన్న అన్ని గ్రీన్‌కార్డులను జారీ చేయడంలో అమెరికా ప్రభుత్వం తరచూ విఫలం కావడమే ఇందుకు కారణం.
