కాలిఫోర్నియాకు చెందిన మల్టీనేషనల్ ఆన్‌లైన్ రిటైల్ కంపెనీ ఈబే పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపునకు తెరలేపింది. సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 1000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఉద్యోగుల వేతనాల బిల్లు, కంపెనీ వ్యవహారాల ఖర్చు వ్యాపారానికి మించి ఉండటం,మరోవైపు ఆర్థికమాంద్యం పరిస్థితుల కారణంగా లే ఆఫ్ ప్రకటించక తప్పటం లేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు కంపెనీ సీఈవో జామి లాన్నోన్ నుంచి సంస్థ ఉద్యోగులకు సందేశాలు వెళ్లాయి. జూమ్ కాల్స్‌లో ఆయా ఉద్యోగు లకు లే ఆఫ్ సమాచారాన్ని టీమ్ లీడర్లు, వివిధ విభాగాల బాస్‌లు అందజేస్తున్నారని లాన్నోన్ చెప్పారు.