Namaste NRI

ఎన్నికల వేళ రిషి సునాక్‌కు ఎదురుదెబ్బ

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. ఇవి సునాక్‌ ప్రధాని పీఠంపైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. బ్లాక్‌పూల్‌ సౌత్‌ పార్లమెంటు సీటుకు జరిగిన ఉప ఎన్నికలో నూ టోరీలు ఓటమి పాలయ్యారు. ఈ ఏడాది చివర్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఫలితాలు కన్జర్వేటివ్‌ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొత్తం దేశం ఏమనుకుంటుందో బ్లాక్‌పూల్‌ సౌత్‌ తెలిపింది. మార్పు కోరుతున్నామని సునాక్‌కు , కన్జర్వేటివ్‌లకు ప్రజలు నేరుగా సందేశం పంపారు అని లేబర్‌ పార్టీ సీనియర్‌ నేత సర్‌ కీర్‌ స్టార్మర్‌ తెలిపారు. బ్లాక్‌పూల్‌ సౌత్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థి డేవిడ్‌ జోన్స్‌పై లేబర్‌ పార్టీ నేతల క్రిస్‌ వెబ్‌ ఘన విజయం సాధించారు.  గత 40 సంవత్సరాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీకి ఇదే దారుణ ఫలితమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Social Share Spread Message

Latest News