బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు షాక్ తగిలింది. కేబినెట్ నుంచి గవిన్ విలియమ్సన్ రాజీనామా చేశారు. తోటి ఎంపీలపై నోరుపారేసుకుంటారని, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తారని ఆయనపై గతంలోనే విమర్శలు ఉన్నాయి. తాజా మాజీ కన్జర్వేటివ్ పార్టీ మహిళా చీఫ్ విప్ విండీ మోర్టాన్‌ను ఆయన బెదిరించారని ఆరోపణలున్నాయి. మాజీ ప్రధాని లిజ్ ట్రస్‌కు సాయపడలేదని, బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు తనను ఆహ్వానించలేదని తిడుతూ విండీకి విలియమ్‌సన్ చేసిన మెసేజ్‌లు ఇటీవల బహిర్గతమవడం తెల్సిందే. మూడేళ్ల క్రితం రక్షణమంత్రిగా ఉన్న కాలంలో ఉద్యోగులను నాలుక చీలుస్తానని, కోపంతో కిటికీ నుంచి బయటకు విసిరేస్తానని అరిచేవారని వార్తలొచ్చాయి. ఈ ఆరోపణలు , రాజీనామా పై సునాక్ విచారం వ్యక్తం చేశారు. విలియమ్స్‌ను గతంలోనూ రెండుసార్లు పదవి నుంచి తప్పించారు. మరోవైపు వివాదాల్లో చిక్కుకున్న వాళ్లను కేబినెట్‌లోకి తీసుకోవడం ప్రతిపక్ష లేబర్ పార్టీ, ప్రధాని రిషి సునాక్‌పై విమర్శలు గుప్పిస్తోంది.