Namaste NRI

రాకాస నుంచి మనసుని హత్తుకునే పదే పదే మెలోడీ సాంగ్ రిలీజ్

ప్రదే పదే ప్రాణం నిన్నే కోరగా.. కలే నిజం కాదా నిన్ను చేరగా..ఒకే ఒక ఆశ చాలుగా నువ్వే చాలుగా..ప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ అంటూ అమ్మాయి తన మనసులోని ప్రేమను అబ్బాయికి చెప్పటానికి ఎంతో ఆశతో, ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇంతకీ అమ్మాయి మనసులో ప్రేమను సంపాదించుకున్న అబ్బాయి కథేంటో తెలుసుకోవాలంటే రాకాస సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్‌. జీ స్టూడియోస్‌ సమర్పణలో నటి, నిర్మాత నిహారిక కొణిదెల తన పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్‌ కుమార్‌ బన్సాల్‌తో కలిసి ఈ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌, నయన్‌ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 3న రిలీజ్‌ చేయబోతున్నారు.

ఈ క్రమంలోనే పదే పదే అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్‌ను తాజాగా రిలీజ్‌ చేసింది. ఈ లిరికల్‌ వీడియో సాంగ్‌ని చూస్తుంటే హీరో మీద హీరోయిన్‌కి ఉన్న ప్రేమ, వన్‌ సైడ్‌ లవ్‌ స్టోరీ కనిపిస్తోంది. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, వారి ప్రేమను చాటేలా సాంగ్‌ సాగింది. ఇక గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన ఈ పాటలోని విజువల్స్‌ మనసుని హత్తుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, దర్శకత్వం: మానస శర్మ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మన్యం రమేష్‌, సంగీతం: అనుదీప్‌ దేవ్‌, సినిమాటోగ్రాఫర్‌: రాజు ఎదురోలు, యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌: విజయ్, ఎడిటర్‌: అన్వర్‌ అలీ, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రామాంజనేయులు, ఆర్ట్‌ డైరెక్టర్‌: పుల్ల విష్ణు వర్ధన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events