Skip to main content

Namaste NRI

రాజా రవి వర్మ పెయింటింగ్‌… వేలంలో రూ.167 కోట్లతో సరికొత్త రికార్డ్!

ప్రఖ్యాత భారత చిత్రకారుడు రాజా రవి వర్మ 1890లో గీసిన యశోద & కృష్ణ చిత్రం ఈ నెల 1న జరిగిన వేలంలో రూ.167 కోట్ల ధర పలికింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అధినేత సైరస్‌ పూనావాలా ఈ చిత్రాన్ని కొనుగోలు చేశారు. ఈ చిత్రాన్ని వేలం వేసిన సాఫ్రాన్‌ ఆర్ట్స్‌ స్ప్రింగ్‌ లైవ్‌ ఆక్షన్‌ దీనికి రూ.80-120 కోట్లు రావొచ్చని అంచనా వేసింది.

అయితే గత రికార్డులను చెరిపేస్తూ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఒక భారతీయ కళాఖండంగా ఈ చిత్రం నిలిచింది. దీన్ని కొనుగోలు చేసిన పూనావాలా మాట్లాడుతూ జాతీయ సంపద అయిన రాజా రవి వర్మ చిత్రాన్ని కొనుగోలు చేసి భద్రపరిచే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజలు దీన్ని చూసేందుకు అందుబాటులో ఉంచుతాను అని వ్యాఖ్యానించారు.

చిత్రం ప్రత్యేకత..
రాజా రవివర్మ చిత్రాల్లో యశోధ-కృష్ణ పెయింటింగ్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మాతృత్వాన్ని, బాలకృష్ణుడి లీలలను తన కుంచెతో ఆయన అత్యంత సహజంగా, రమణీయంగా తీర్చిదిద్దారు. వర్ణాల కలయిక, బావ వ్యక్తికరణలో ఈ చిత్రం ఎంతో గొప్పగా నిలిచింది.

Social Share Spread Message

Latest News