Namaste NRI

ఈజిప్టులో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

అమెరికా పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడి నుంచి నేరుగా ఈజీప్టుకు చేరుకున్నారు. దీంతో 1997 తర్వాత అంటే గడిచిన 26 ఏళ్లలో ఈజీప్టు పర్యటనకు వెళ్లిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. మరోవైపు ప్రధాని మోదీ తమ దేశ పర్యటనకు చేరుకున్న నేపథ్యంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సీసీ ఆయనకు కైరో ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ గార్డ్ ఆఫ్ హానర్ తెలిపారు. అయితే ప్రధాని మోదీ తన ఈజిప్టు పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సీసీతో భేటీ అవుతారు.

ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలు, ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఆచరించాల్సిన ప్రణాళికలపై చర్చిస్తారు. అనంతరం ఆ దేశంలోని ప్రముఖులతో, ప్రవాస భారతీయులతో కలుస్తారు. అలాగే 11వ శతాబ్దంలో నిర్మించిన చారిత్రక అల్ హకీమ్ మసీదు మోదీ సందర్శించనున్నారు. ఇంకా కైరోలోని హీలియోపోలీస్ కామన్వెల్త్ యుద్ధ స్మశానవాటికను సందర్శించి,  మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన 4,000 మందికి పైగా సైనికులకు నివాళులర్పిస్తారు. కాగా, 1997 తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటించడం ఇదే ప్రప్రథమం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events